1 తిమోతీ 3:16 ప్రకారం.. పౌలు దృష్టిలో యెహోవా శరీరధారిగా మారి యేసులా అవతరించాడా?

నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. – 1 తిమోతి 3:16

ఈ వాక్యం ఇంగ్లీషు KJV బైబిల్ ప్రకారం “God was manifested in the flesh” అని ఉంది కాబట్టి యెహోవాయే యేసుగా వచ్చాడ న్నది నేటి సువార్తికుల వాదన! సరే ఇంతకు సశరీరుడుగా వచ్చింది యెహోవానా? యేసా? ఇంగ్లీషు KJV బైబిల్ అనువాదం ఎంత వరకు సమంజసమైనది? అన్న ప్రశ్నలకు సమాధానం  మనం తెలుసుకోవాల్సి ఉంది.

వాస్తవానికి ఏదైనా ఒక వాక్యం ఆధారంగా ఒక విశ్వాసాన్ని ఏర్పర చుకున్నప్పుడు ఆ విశ్వాసం సరైనదా? కాదా? అన్నది తెలుసు కోవాలంటే... గ్రంథంలో మిగతా వాక్యాలు ఆ వాక్యాన్ని సమర్ధిస్తున్నాయా? లేవా? అన్నది చూడాలి.

ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని 1 తిమోతి 3:16 ఇంగ్లీషు బైబిల్ అనువాదానికి బైబిల్ ఇతర వాక్యాలు ఎంతవరకు సామర్ధిస్తున్నాయో గమనిద్దాం.


యెహోవా శరీరధారిగా మారి యేసులా పుట్టాడా? లేక యెహోవా, యేసును శరీరధారిగా పుట్టించాడా? 

శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.- హెబ్రీ 5:7 

కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదు గానినాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.  –హెబ్రీ 10:5-7

దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. –రోమా 8:3 

యెహోవాయే శరీరధారిగా మారి యేసులా పుట్టాడన్న భ్రమకు గురై ఉన్న ప్రతీ ఒక్కరూ పై వాక్యాలలో హెబ్రీ 10:5,6 వాక్యాలు తప్పక గమనించాలి. ఈ వాక్యాలలో ప్రార్ధనా పూర్వకంగా మాట్లాడుతుంది స్వయంగా యేసు అలాగే మాట్లాడుతున్నది యెహోవా దేవునితో అన్నది అత్యంత గమనార్హం. అందులో యేసు, యెహోవాతో చెబుతున్న అత్యంత గమనార్హమైన విషయం- “నాకొక శరీరమును అమర్చితివి” అన్నది. దీనిని బట్టి పౌలు ప్రకారం యెహోవా, శరీరధారిగా రాలేదు గాని, యెహోవా, యేసుకు శరీరాన్ని ధరింపజేసి పంపాడని తేటతెల్లమౌతుంది.

ఇక పౌలు ఎంతో స్పష్టంగా “దేవుడు (యెహోవా) తన స్వంత కుమారుని పాపశరీరాకారముతో పంపి” అంటున్నాడు. తప్పితే దేవుడు, శరీరాన్ని ధరించి తన స్వంత కుమారునిగా వచ్చి” అనటం లేదు.

మరి ముఖ్యంగా హెబ్రి 5:7 వాక్యంలో యేసు శరీరధారిగా ఉన్న సమయంలో మహారోదన ముతోనూ, కన్నీళ్లతోనూ ప్రార్ధనలు, యాచనలు సమర్పించింది ఎవానికి? “తన్ను మరణం నుండి రక్షింపగలవానికి” అంటే “యెహోవాకు!” దీనిని బట్టి శరీరధారిగా వచ్చింది యెహోవా కాదు, యేసు అని పౌలు ప్రకటిస్తున్నప్పటికి యెహోవాయే, యేసుగా వచ్చాడనటం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి.

పౌలు దృష్టిలో యెహోవాయే శరీరాన్ని ధరించి యేసులా అవతరించి ఉంటే... యెహోవా, యేసును “పుట్టించెను” అని ప్రకటించగలిగి ఉండేవాడా?

అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. – అపోస్తలుల కార్యములు 3:13 

పౌలు దృష్టిలో యెహోవాయే శరీరాన్ని ధరించి యేసులా అవతరించి ఉంటే... యేసు యొక్క దేవుడు యెహోవా అని ప్రకటించగలిగి ఉండేవాడా?

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు… -ఎఫెసి 1:19

 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.- ఎఫెసి 1:19

పౌలు దృష్టిలో యెహోవా యే యేసుగా అవతరించాడా? లేక యెహోవా యేసును పంపాడా?

ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. – అపోస్తలులకార్యములు 17:31

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. – గలతి 4:4

దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. –హెబ్రీ 3:2  

పౌలు దృష్టిలో యెహోవాయే యెసైతే “యేసు ద్వారా యెహోవాకు” కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు చెల్లించమని యెందుకు చెబుతాడు?

మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. –రోమా 1:8

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,  క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.- ఎఫిసి 3:20,21

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. –కొలస్సీ 3:17 

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము… -హెబ్రీ 13:15 

పౌలు దృష్టిలో యెహోవాయే శరీరాన్ని ధరించి యేసులా అవతరించి ఉంటే... యేసు పరలోకానికి వెళ్లిపోయాక తిరిగి యెహోవాగా మారిపోయారని గాక యెహోవా వద్ద విజ్ఞాపన చేసే యాజకుని స్థానంలో ఉన్నారని ఎందుకు చెబుతారు?

ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. –హెబ్రీ 7:24,25

… దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే. – రోమా 8:34   

పౌలు దృష్టిలో యెహోవాయే శరీరాన్ని ధరించి యేసులా అవతరించి ఉంటే... పౌలు, పరలోకంలో ఉన్న యేసే యెహోవా అని ప్రకటించక, లేఖనం ప్రకారం యేసు, యెహోవా వద్ద ఉండే నిరంతర యాజకుడని ఎలా ప్రకటించగలిగాడు?

ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. –హెబ్రీ 4:14 

ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియ మింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు. –హెబ్రీ 8:6 

మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. 
వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను. – హెబ్రీ 7:20, 21

గమనిక: యేసు కొంత కాలం వరకు దేవుని యాజకునిగా ఉంది ఆ తరువాత ఆయన దేవునిగా మారిపోతారాని కొందరు ఊహించుకుంటూ ఉంటారు. వాస్తవానికి యేసు పరలోకంలో నిరంతరం యాజకునిగానే ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా లేఖనంలో యెహోవాయే ప్రమాణపూర్వకంగా ప్రకటించాడు.

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. – కీర్తనలు 110:4   

అయితే ఇంగ్లీషు బైబిల్లో  “God was manifested in the flesh” అని ఉంది కదా?

ఇంగ్లీషు బైబిల్లో “God was manifested in the flesh” అని ఉంది కదా! కాబట్టి యెహోవాయే యేసుగా వచ్చాడన్నది నేటి సువార్తికుల వాదన. దీనికి మొదటి సమాధానం- నిజంగా పౌలు దృష్టిలో దేవుడే శరీరధారిగా మారి యేసుగా వచ్చాడన్నదే నిజమైతే “దేవుడు (యెహోవా) తన స్వంత కుమారుని పాపశరీరాకారముతో పంపి” అని ఎందుకు చెబుతాడు? అంటే కాదు యెహోవాయే యేసైతే... యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆయన తిరిగి యెహోవాగా మారిపోయి ఉంటారని ఊహించుకుని యేసునే స్తుతులు-స్తోత్రాలు, ప్రార్ధనలు-కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పి ఉండే వాడు! కానీ యేసు “ద్వారా” యెహోవాకు ప్రార్ధనలు-కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఎందుకు చెబుతాడు? ముఖ్యంగా యెహోవా యేసును శరీరాధారిగా ఈ లోకంలో పుట్టించాడని, పరలోకంలో సైతం ఆయన విశ్వాసుల కొరకు దేవుని వద్ద విజ్ఞాపన చేస్తూ యాజకునిగా ఉంటారని ఎందుకు చెబుతాడు? అంతే కాక యేసు శరీరాధారిగా ఉంటూ మహా రోదనతో ఆ యెహోవాకు  ప్రార్ధనలు, యాచనలు చెల్లించారని ఎందుకు చెబుతాడు? కాస్త ఆలోచించగలరు.

దీనిని బట్టి 1 తిమోతి 3:16 ఇంగ్లీషు బైబిల్ అనువాదానికి బైబిల్ ఇతర వాక్యాలు ఎంత మాత్రమూ సామర్ధించటం లేదని తేటతెల్లమైంది.

ఇక రెండవ సమాధానం ఏమిటంటే- “God was manifested in the flesh” అన్నది కేవలం అనువాద లోపం మాత్రమే! ఈ విషయం అర్థం కావాలంటే  5వ శతాబ్దపు ప్రాచీన  “Alexandrinus Codex” గ్రీకు బైబిల్లో గమనిస్తే “he was manifested in the flesh” అని చూడగలం. అంటే “ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను” అని అర్థం. ఈ వాక్యం లో “ఆయన” అంటే “యెహోవా” అని కాదు “యేసు.” అంటే యేసు శరీర ధారిగా ఈ లోకం లో పుట్టారని అర్థం. ఒక్క యేసే కాదు ఈ లోకంలో పుట్టే ప్రతి ఒక్కరూ ఆవిధంగా శరీరధారులుగా పుట్టేవారే! దీనికి సంబంధించిన పూర్తి వివరణ “యోహాను 1:1-14 వాక్యాల వాస్తవికత!” అన్న అంశంలో చర్చించటం జరిగింది. ఒకవేళ “ఆయన” అంటే “యెహోవాయే” అయి ఉంటాడని సందేహ పడేవారు తిరిగి పై వివరణ చదువగలరు. ఇక  5వ శతాబ్దపు ప్రాచీన  “Alexandrinus Codex” గ్రీకు బైబిల్ ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా “he was manifested in the flesh” అని అనేక అనువాదాలు చెయ్యటం జరిగింది. వాటిని ఈ క్రింది గమనించగలరు.

1. American Standard Version 1901
And without controversy great is the mystery of godliness; He who was manifested in the flesh.

2. Common English Bible
Without question, the mystery of godliness is great: HE was revealed as a human.

3. Complete Jewish Bible (CJB)
Great beyond all question is the formerly hidden truth underlying our faith: He was manifested physically and proved righteous spiritually

4. Douay-Rheims 1899
And evidently great is the mystery of godliness, which was manifested in the flesh,

5. English Standard Version Anglicised (ESVUK)
Great indeed, we confess, is the mystery of godliness: He was manifested in the flesh.

6. NET Bible (©2006)
And we all agree, our religion contains amazing revelation: He was revealed in the flesh.

7. Holman Christian Standard Bible (©2009)
And most certainly, the mystery of godliness is great: He was manifested in the flesh.

8. Good News Translation (GNT)
No one can deny how great is the secret of our religion: He appeared in human form.


9. THE MESSAGE
He appeared in a human body, was proved right by the invisible Spirit


10. Revised Standard version
Great indeed, we confess, is the mystery of our religion: He was manifested in the flesh

11. New English Translation (NET)
And we all agree, our religion contains amazing revelation: He was revealed in the flesh.

12. New International Version (NIV)
Beyond all question, the mystery from which true godliness springs is great: He appeared in the flesh.

13. New International Version – UK (NIVUK)
Beyond all question, the mystery from which true godliness springs is great: He appeared in the flesh.

14. New American Standard Bible
By common confession, great is the mystery of godliness: He who was revealed in the flesh.

15. New Revised Standard Version (NRSV)
Without any doubt, the mystery of our religion is great: He was revealed in flesh.

16. English Standard Version
Great indeed, we confess, is the mystery of godliness: He was manifested in the flesh

17. Revised Version 1881
And without controversy great is the mystery of godliness; He who was manifested in the flesh.

18. The Voice (VOICE)
And I think you will agree that the mystery of godliness is great: He was revealed in the flesh.

No comments:

Post a Comment