ఫిలిప్పీ 2:9-11 ప్రకారం “ప్రతి వాని మోకాలును యేసు నామములో ఎవని ముందు వంగాలి? యేసు ముందా? యెహోవా ముందా?”

అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. – ఫిలిప్పీ 2:9-11

    
   1. పై వాక్యంలో “ప్రతీ వాని మోకాలును యేసు నామమున వంగునట్లు” అంటే ఎవని ముందు వంగునట్లు అని అర్థం? యేసు ముందా? యెహోవా ముందా? ఈ వాక్యంలో “యేసు నామమున యేసుముందు వంగునట్లు” అని లేదు కదా!
        
   2. వాస్తవానికి “ప్రతీ వాని మోకాలును యేసు నామమున తండ్రి అయిన దేవుని ముందు వంగునట్లు” అన్నది పౌలు అసలు ఉద్దేశం  అన్నది గమనించాలి. ఇదే విషయాన్ని పౌలు ఈ క్రింది వాక్యాలలో చెబుతున్నాడు.

నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు  అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.  – రోమా 14:11-12

మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,  క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. ఎఫెసి 5:20-21

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.  కొలస్సీ 3:17   

పై వాక్యాలలో రోమా 14:11-12 వాక్యాలలో పౌలు ఉటంకిస్తున్న లేఖనంలో స్వయంగా దేవుడైన యెహోవా ప్రతీ మోకాలు ఎవని ముందు వంగాలని చెబుతున్నాడు? “ప్రతీ మోకాలును నా యెదుట వంగును” అన్న దానిని బట్టి ప్రతీ మోకాలూ వంగాల్సింది దేవుడైన యెహోవా ముందు అన్నది గమనార్హం. అంతేకాదు “ప్రతి మోకాలును దేవుని ముందు వంగును” అని చెప్పి “గనుక మనలో ప్రతి వాడును దేవునికి (యెహోవాకు) లెక్క అప్పగింపవలెను” అని చెబుతున్నాడు. అంటే ఏ దేవునికైతే మనం లెక్క అప్పగించాల్సి ఉందో ఆ దేవునిముందే మన మోకాలూ వంగాల్సి ఉంది అన్న విషయాన్ని పౌలు స్పష్టపరుస్తున్నాడు.

దీనిని బట్టే పౌలు ఎఫెసి 5:20-21 వాక్యాలలో యేసు క్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఇంకా కొలస్సీ 3:17 వాక్యంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించమంటున్నాడు.  కాబట్టి ప్రతీ మోకాలును కచ్చితంగా వంగాల్సింది యేసుముందు కాదు! కానీ యెహోవా ముందు మాత్రమే! ఇదే విషయాన్ని స్వయం గా యెహోవా ఈ క్రింది విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.

నా (యెహోవా) యెదుట ప్రతీ మోకాలును వంగుననియు ప్రతీ నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పెరట ప్రమాణము చేసియున్నాను. – యెషయ 45:23

పై లేఖనాన్నే పౌలు రోమా 14:11-12 వాక్యాలలో ఉటంకిస్తూ ప్రతివాని మోకాలూ దేవుని  (యెహోవా) ముందు వంగాలని చెబుతున్నాడు.

పౌలు, ప్రార్థనలు, విజ్ఞాపనములు, విన్నపాలు ఎవనికి తెలియజేయమంటున్నాడు? యేసుకా? యెహోవాకా?

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి (యెహోవాకు) తెలియజేయుడి.  ఫిలిప్పీ 4:6

పై వాక్యంలో పౌలు ప్రార్ధన, విజ్ఞాపములు, విన్నపాలు యేసుకు కాక దేవునికి (యెహోవాకు) తెలియజేయమంటున్నాడు! దీనిని బట్టి నిజంగా ఫిలిప్పు 2:9-11 వాక్యాల ప్రకారం పౌలు ఉద్దేశంలో ప్రతి వానీ మోకాలూ యేసు నామంలో యేసు ముందు వంగటమే అయితే మన ప్రార్థనలు, విన్నపాలు యేసుకు తెలియజేయమని చెప్పక, దేవునికి (అంటే యెహోవాకు) తెలియజేయమని ఎందుకు చెబుతాడు? కాస్త ఆలోచించగలరు.   

No comments:

Post a Comment