ఫిలిప్పీ 2:6 ప్రకారం యేసు, దాసుని స్వరూపం ధరించుకోక ముందు పౌలు దృష్టిలో దేవుడా?

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని  మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.  ఫిలిప్పీ 2:6,7

వాస్తవానికి పై వాక్యంలో పౌలు, యేసును “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు” అంటూ ఎంతో గొప్పగా ఆయనను అతిశయించటం వెనుక లక్ష్యం- యేసును ఎదోలా దేవుడు అని నిరూపించటం కాదు! కానీ...యేసు రాకకు పూర్వం యూదుల చేతిలో అనేకమంది ప్రవక్తలు సిలువ వేయబడి, రాళ్ళతో కొట్టబడి చంపబడినప్పటికి, అదే యూదుల వద్దకు యేసు, దేవుని రాజ్యసువార్తను ఇచ్చేనిమిత్తం అనేక నిందారోపణలు, హింసలను సైతం పొందటాన్ని తిరస్కరించక, దేవునివద్ద  ఎంతో గొప్ప స్థానాన్ని సైతం విడిచిపెట్టి ఒక సామాన్యుని మాదిరిగా వచ్చారని చెప్పటానికి అలంకారికంగా పౌలు “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని  మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను” అని చెబుతున్నాడు. వాస్తవానికి ప్రతీ ప్రవక్తా దేవుని వద్ద నుండి, దేవుని వద్ద తమకు ఉన్న గొప్ప స్థానాన్ని విడిచి వచ్చిన వారే (యోహాను 1:6)!


యేసు ఏనాడైనా తన్ను తాను దేవునితో సమానం అని భావించుకున్నారా?

ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.  కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. యోహాను 5:18,19

గమనిక: యేసు, దేవునిని తన స్వంత తండ్రి అని చెప్పి  “తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నారు” అన్నది యూదులు యూదులు యేసు పై మోపిన అభియోగం. దానిని యేసు ఆమోదించక వారు మోపిన అభియోగానికి సమాధానంగా “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు అని చెప్పి తాను దేవునితో సమానమైనవాడను కానని ప్రకటించారు.

నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.- యోహాను 5:30

తండ్రి నాకంటె గొప్పవాడు... – యోహాను 14:28

నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. –యోహాను 10:29       

పౌలు దృష్టిలో యేసు, యెహోవాతో పాటు సమాన దేవుడే అయితే... యేసు పరలోకానికి వెళ్లిపోయాక తిరిగి దేవుడైపోయారని ప్రచారం చేస్తున్నాడా?
 
ఒకవేళ యేసు దాసుని స్వరూపం ధరించక ముందు యెహోవాతో పాటు సమాన దేవుడే అయితే... మరి అదే యేసు పరలోకానికి వెళ్లిపోయాక తిరిగి దేవుడైపోయారని ప్రకటించక “దేవుని వద్ద విజ్ఞాపనం చేసుకునే వానిగా” “దేవుని వద్ద యాజకుడని” ఎందుకు ప్రకటిస్తాడు?

ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. హెబ్రీ 4:14

మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;  ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.  హెబ్రీ 7:20-22

ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. హెబ్రీ 7:24, 25

ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియ మింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు. రోమా 8:6  

పౌలు, యేసు పరలోకానికి వెళ్లిపోయాక యెహోవాతో పాటు సమాన దేవునిగా ఉంటారని ప్రచారం చేస్తున్నాడా? లేక యెహోవాకు లోబడిన దాసునిగా ఉంటారని ప్రకటిస్తున్నాడా?

మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు (యేసు) తనకు సమస్తమును లోపరచిన దేవునికి (యెహోవాకు) తానే లోబడును. – 1 కోరింథీ 15:28  


పరలోకంలో యేసు దేవునిగా ఉన్నారా? దేవునికి దాసునిగా ఉన్నారా?

జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.  ప్రకటన 3:12   


No comments:

Post a Comment