యేసు దేవుడే అయితే యేసు స్వతంత్రంగా కలిగి ఉన్న ప్రత్యేకత ఏదైనా ఉందా?

నేటి అభినవ సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసు తండ్రి లేకుండా పుట్టారు, అనేక అద్భుతాలు చేయగలిగారు, పాపులను క్షమించారు, ఇంకా ఆయనకు  సర్వాధికారాలు ఇవ్వబడ్డయి, రక్షకుడని, ప్రభువని  పిలువబడ్డారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఒక్క యేసుకు తప్ప బైబిల్లో ఎవరికీ లేవు కాబట్టి యేసును దేవుడు అనటంలో తప్పేమిటి? అన్నది. ఇలాంటి వాదనలు చేసేవారు అసలు యేసు స్వతంత్రంగా ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి గానూ క్రింది వాక్యాలు జాగ్రత్తగా గమనించగలరు.

యేసు ఈ లోకానికి రావటంలో యేసు అభీష్టం ఏదైనా ఉందా?

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.యోహాను 3:16

నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను...-యోహాను 7:28,29

యేసు స్వతంత్రంగా ఏదైనా చేయగలిగే శక్తి కలిగి ఉన్నారా?

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు.- యోహాను 5:19

నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యోహాను 5:30

నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. యోహాను 6:38   


యేసు స్వతంత్రంగా ఏదైనా మాట్లాడే శక్తి కలిగి ఉన్నారా?

నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. యోహాను 8:28

యేసు స్వంత శక్తితో  అద్భుతాలు-మహిమలు చెయ్యగలిగారా?

ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందిన వానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. -అ.పో.కా 2:22

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడా యనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరినీ స్వస్థ పరచుచు సంచ రించుచుండెను.  -అ.పో.కా 10:38

అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. లూకా 11:20  

యేసు తన ఇష్టాన్ని నెరవేర్చుకునే శక్తిని కలిగి ఉన్నారా?


నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. –యోహాను 6:38  


కనీసం యేసు స్వంత శక్తీ-సామర్ధ్యాలు కలిగి ఉన్నారా?

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. -అ.పో.కా 10:38

కనీసం యేసు స్వంత అధికారం కలిగి ఉన్నారా?

తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై 
యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. యోహాను 5:26

కనీసం యేసు పరలోకంలో నైనా అధికారాన్ని కలిగి ఉన్నారా?

అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.  అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. మత్తయి 20:20-23  

కనీసం యేసు తాను పొందిన అధికారాన్ని తనవద్దే శాశ్వతంగా ఉంచుకునే అధికారాన్నైనా కలిగి ఉన్నారా?

అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. – 1 కోరింధీ 15:24

యేసుకు లభించిన “ప్రభువు” “క్రీస్తు” అన్న స్థానాలు యేసు స్వంతమా?

మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. -అ.పో.కా 2:36

యేసుకు లభించిన “రక్షకుడు” అన్న స్థానం యేసు స్వంతమా?

ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు. -అ.పో.కా 5:31

కనీసం యేసు కలిగి ఉన్న ఉనికి యేసు స్వంతమా?

అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.-అ.పో.కా 13:23

యేసు కలిగి ఉన్న జీవం యేసు స్వంతమా?

జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. యోహాను 6:57  

చివరికి యేసు కలిగి ఉన్న సమస్తమూ యేసు స్వంతమా?

నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.- యోహాను 17:8

ఈ విధంగా యేసు కలిగి ఉన్న సమస్త అధికారాలూ, శక్తీ-సామర్ధ్యాలూ, క్రీస్తు, ప్రభువు అన్న స్థానాలూ, ఆయన ఉనికీ, జీవమూ సమస్తమూ దేవుడు, యేసుకు అనుగ్రహించునవే తప్ప యేసు స్వతహాగా ఏదీ కలిగి లేరని అనేక పరిశుద్ద వాక్యాల పరిశీలనలో తెలుసుకున్నాం. అటువంటప్పుడూ ఈ ప్రత్యేకతలన్నీ యేసుకు ఇచ్చిన వాడు (యెహోవా) దేవుడు అవుతాడా? ప్రశాంతంగా ఆలోచించగలరు.

No comments:

Post a Comment