తీతుకు 2:13 వచనం ప్రకారం యేసు “మహా దేవుడా?

KJV బైబిల్ ప్రకారం:


అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు... తీతుకు 2:13

Looking for that blessed hope and the glorious appearing of the great God 'and'     our saviour Jesus Christ.       - TITUS 2:13

పై king James version బైబిల్ వచనం ప్రకారం నేటి సువార్తికుల వాదన ఏమిటంటే- ఈ వచనం లో పౌలు- “మహా దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు” అన్న వచనం లో “మహా దేవుడు” అని చెబుతుంది యేసుని ఉద్దేశించి కాబట్టి మనం యేసును మహా దేవునిగా నమ్మాలన్నది.  సరే పౌలు యేసును మహా దేవునిగా నమ్మమన్నది యేసునా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు తీతుకు 2:13 వచనం గ్రీకు మూలం ప్రకారం ఏవిధంగా వ్రాయబడి ఉందో ఈ క్రింది గమనిద్దాం.

Greek బైబిల్ ప్రకారం:

Awaiting for the blessed hope, and the appearing of the glory of the great God  'and' saviour of us, Christ Jesus.       - TITUS 2:13

పై గ్రీకు మూలం ప్రకారం వ్రాయబడ్డ ఇంగ్లీషు బైబిల్ వచనాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే ఈ క్రింది విధంగా చదవగలం.    
శుభ ప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుని మహిమా యొక్క ప్రత్యక్షత కొరకు, మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు... తీతుకు 2:13

ఇదే వచనాన్ని అచ్చం గ్రీకు మూలంలో వ్రాయబడిన ప్రకారం రోమన్ కాథలిక్ బైబిల్ యొక్క అనువాదాన్ని ఈ క్రింది గమనించగలరు.

ఇట్టు ఇహలోకంలో జీవించుచు, సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు... – తీతుకు 2:13 (కాథలిక్ బైబిల్)

ఇప్పటివరకు సాగిన పరిశీలనను దృష్టిలో ఉంచుకుని తీతుకు 2:13 వచనం ఒకసారి గ్రీకు మూలానికి మరియు తెలుగు అనువాదానికి మధ్య ఉన్న సున్నితమైన తేడాను గమనించండి.

గ్రీకు మూలం ప్రకారం పౌలు: “మహా దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు,  మరియు  మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు” అంటూ ఇద్దరి మహిమల యొక్క ప్రత్యక్షతల గురించి చెబుతున్న వైనాన్ని గమనించగలం.

తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. తీతుకు 2:13

King James ఇంగ్లీషు బైబిల్ ప్రకారం తెలుగులో చేయబడ్డ అనువాదాన్ని బట్టి గమనిస్తే పౌలు: “మహా దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు” అని చెప్పినట్టు చూడగలం. వాస్తవానికి ఈ వాక్యం గ్రీకు మూలం ప్రకారం గమనిస్తే “మహాదేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు” మరియు “యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు” అంటూ వివరంగా వ్రాయబడి ఉంది. అయితే తెలుగులో “మహా దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు” అని కలిపి వ్రాయటం వలన యేసే మహా దేవుడు అన్న భ్రమలో క్రైస్తవ బోధకులు పడిపోవటం జరిగింది.

ముఖ్యంగా పౌలు తీతుకు 2:13 వచనంలో మహా దేవుడైన యెహోవా గురించిన మరియు యేసును గురించిన ఇద్దరి ప్రస్తావనలు చేశాడనటానికి గొప్ప ఆధారం ఏమిటంటే అదే తీతుకు పత్రిక ప్రారంభం నుండే పౌలు, దేవుడు మరియు యేసుల ఇద్దరి ప్రస్తావనలతో తన పత్రిక ప్రారంభించటం! దానిని ఈ క్రింది గమనించగలరు.

బైబిల్లో ఇద్దరు మహా దేవుళ్ళు ఉండటానికి అవకాశం ఉందా?

దేవుని (యెహోవా) వంటి మహా దేవుడు ఎక్కడ ఉన్నాడు? – కీర్తనలు 77:13

బైబిల్లో ఆ మహా దేవుడు ఎవరు?

వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.  ద్వితీ 7:21

ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చు కొననివాడు. ద్వితీ 10:17

ఇంతకూ పౌలు దృష్టిలో మహా దేవుడు ఎవరు?


 ... ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హెబ్రీ 1:4
మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. – హెబ్రీ 8:2

అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవన మునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. హెబ్రీ 7:3   

పౌలు తన ప్రతి పత్రికలోను యెహోవానూ మరియు యేసును వేరువేరు గానే చూపేవాడు!            

మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. – రోమా 1:3

అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున ... 2 థెస్స్ 2:11

తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును... – 1 థెస్స్ 1:1

మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు... – 1 తిమోతీ 1:1

మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. – 1 తిమోతి 1:1
     
ఈ విధంగా పౌలు యేసు పరలోకానికి చేర్చుకోబడిన తరువాత సహితం దేవుని మరియు యేసు ఇద్దరి అస్తిత్వాన్ని వేరు వేరుగానే చూపేవాడు. తప్పితే ఏనాడూ యెహోవా, యేసూ ఇద్దరినీ కలిపి ఒక్కదేవునిగా లేక ఒక్క అస్తిత్వం గా ఎక్కడా పరిచయం చేయలేదు. వాస్తవం ఇదైనప్పుడు తీతుకు 2:13 వచనంలో పౌలు, యేసును ఉద్దేశించి “మహా దేవుడు” అన్నాడనటం ఎంతవరకు సమంజసమో ఆలోచించగలరు.   

No comments:

Post a Comment