రోమా 9:5 వచనం ప్రకారం పౌలు దృష్టిలో యేసు స్తోత్రార్హుడైన దేవుడా?

పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. రోమా 9:5

Whose are the fathers and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed forever. Amen. -Romans 9:5

ఈ వాక్యంలోGod  blessed forever అన్న వాక్యభాగపు అనువాదం- “దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు” అన్నది. కాబట్టి పై వాక్యాపు సరైన అనువాదం- “శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు” అన్నది. అందుకే ఈ వాక్యపు సరైన అనువాదం రోమన్ కాథలిక్ బైబిల్లో ఈ క్రింది విధంగా చేసినట్లు చూడగలం.

వారు మన పితరుల వంశీయులే క్రీస్తు మానవ జాతిరిత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక. – రోమా 9:5 

అయినప్పటికీ రోమా 9:5 వాక్యంలో పౌలు, యేసునే స్తోత్రార్హుడైన దేవుడని ప్రకటించాడని వాదించే వారు తెలుసుకోవలసింది పౌలు అదే రోమా పత్రికలో అనేకచోట్ల దేవుడైన యెహోవాను స్తుతిస్తున్న క్రమంలోనే రోమా 9:5 వాక్యంలో సైతం దేవుడైన యెహోవానే స్తుతించాడన్నది.


పౌలు అదే రోమా పత్రికలో నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని పదే పదే ప్రకటించింది యేసునా?యెహోవానా?

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన (యెహోవా) స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌. రోమా 1:25

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌. –రోమా 11:33-36

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,  యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతు డును అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. –రోమా 16:25-27

ఈ విధంగా పౌలు రోమా 9:5 వాక్యంతో పాటు అదే రోమా పత్రికలో అనేక వాక్యాలలో నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని పదే పదే ప్రకటించింది యేసును కాదు! కానీ యెహోవాను మాత్రమే అన్న విషయాన్ని గమనించగలం.

పౌలు తన అన్ని పత్రికల్లోనూ నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని ప్రకటించింది యెహోవానే!

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. హెబ్రీ 13:15

నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును. – 2 కోరింధీ 11:31

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసి 1:3

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,  క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. –ఎఫెసి 3:20,21

పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.రోమా 6:18

నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించె దను. -1 కోరింధీ 14:18

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. – 1 కోరింధీ 15:57

కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. -2 కోరింధీ 1:3

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.  -2 కోరింధీ 2:14

మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. – 2 కోరింథీ 8:16

 చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.- 2 కొరింధీ 9:15

ఈ విధంగా పౌలు రోమా పత్రికలో మాత్రమే కాక నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని ప్రకటించింది ఒక్క యెహోవానే తప్ప యేసును కాదు. దానికి కారణం స్వయంగా యేసు ఆ తండ్రి అయిన యెహోవాను స్తుతించటం మరియు ఘనపరచు దాసుడై ఉండటమే!

యేసు- తండ్రీ, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును, వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. –మత్తయి 11:25

యేసు- నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. – యోహాను 8:49                                                                  

No comments:

Post a Comment