బైబిల్ ప్రకారం నిజ దేవుడు ఎవరు? అన్నది నిర్ధారించుకోవటానికి ఒక క్రైస్తవుడు ఎంచుకోవలసిన కొలమానాలేమిటి?

బైబిల్లో దేవుడనేవాడు...

  1. నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడ”ని స్వయంగా ప్రకటించుకుని ఉండాలి!
  2. సకల ప్రవక్తలచే, యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే దేవునిగా ప్రకటించబడి ఉండాలి!
  3. యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే ఘనపరచబడి, కృతజ్ఞతాస్తు తులు చెల్లించబడి ఉండాలి!
  4. యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే ప్రార్ధించబడి ఉండాలి!
  5. తనకు పోలిక కలిగిన మరొకడు లేనివాడై ఉండాలి!
  6. చావు, పుట్టుకలకు అతీతుడై ఉండాలి!
  7. బ్రతికించువాడే కాక చంపువాడై కూడా ఉండాలి!
  8. సర్వ శక్తినీ – అధికారాలునూ  కలిగినవాడై ఉండాలి!
  9. సకల మానవ బలహీనతలకు అతీతుడై ఉండాలి!
  10. భూత, భవిష్య, వర్తమాన కాలాలలోనూ దేవుడై ఉండాలి!
  11. ఈ అన్ని ప్రత్యేకతలలో ఏ ఒక్కదానినో లేక వాటిలో కొన్నిటినో కాక, అన్నిటిని ఉమ్మడిగా కలిగినవాడై ఉండాలి!
ఈ సందర్భంలో పై ప్రత్యేకతలన్నీ కలిగిన దేవుడు ఎవరు? అన్నది బైబిల్ వెలుగులో తెలుసుకుందాం.

నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడ”ని ప్రకటించుకున్న దేవుడు ఎవరు?

మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. నిర్గమ 6:2,3

నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. – యెషయ 45:5,6

మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.  నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.  యెషయ 43:10,11

యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. యెషయ 45:21,22

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు.. –ద్వితీ 32:39

అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్పవేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు. –యెవేలు 2:27  
 

సకల ప్రవక్తలచే, యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే దేవునిగా ప్రకటించబడింది ఎవరు?

ప్రవక్తల ప్రకటన:

ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. యెషయ 45:18

యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు. – 1 దినవృత్తాంతములు 17:20

కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంత టిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. – 2 సమూయేలు 7:22

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు... –యిర్మీయ 10:10
దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. –యెహోషువ 22:22

పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మ జేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియ జేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. ఆమోసు 4:13

ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. –కీర్తనలు 48:14

యేసు ప్రకటన:

మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమం దున్నాడు. మత్తయి 23:9

ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసునన్ను 

సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. మార్కు 10:17-18

ఒక అధికారి ఆయనను చూచిసద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. అందుకు యేసునేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. లూకా 18:18-19

శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మార్కు 12:28,29

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను 17:3
ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయ వలెనని 

ఆయనను అడిగెను. అందుకాయనమంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. మత్తయి 19:16,17

యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. యోహాను 20:17

అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను. లూకా 4:8            

యాకోబు ప్రకటన:

దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే.. –యాకోబు 2:19

(దేవుడు) ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింప జేయుటకును శక్తిమంతుడై యున్నాడు. –యాకోబు 4:12  

యూదా ప్రకటన:

తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,  మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. – యూదా 1:24,25

పేతురు ప్రకటన:

అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. - ఆ.పో.కా 3:13

పౌలు ప్రకటన:

దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక. –రోమా 3:29,30

ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడినవారును ప్రభువులన బడినవారును అనేకులున్నారు.  ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను. – 1 కోరింధీ 8:4-6

కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.  నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. – 12:4-6

మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. గలతీ 3:20

ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. ఎఫెసి 4:5

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.  1 తిమోతీ 2:5      

యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే ఘనపరచబడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడింది ఎవరు?

సకల ప్రవక్తలు స్తుతించింది, ఘనపరచింది ఎవనిని?

అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసినా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. -2 సమూయేలూ 18:28

యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక. – 2 సమూయేలూ 22:47

అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను. – 2 సమూయేలూ 22:50

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.  ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి ... – 1 దినవృత్తాంతములు 16:8,9

యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు. – 1 దినవృత్తాంతములు 16:25

మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి. –కీర్తనలు 115:18

యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.  బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.  మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.కీర్తనలు 150:1-6

యేసు స్తుతించింది, ఘనపరచింది ఎవనిని?

ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచు న్నాను. మత్తయి 11:25

అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యోహాను 11:41  

యేసు ద్వారా స్వస్థత నొందినవారు స్తుతించింది ఎవనిని?

...ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ వాడు లేచి తన యింటికి వెళ్లెను. 

జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. మత్తయి 9:6-9


మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డి వారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి. మత్తయి 15:31

యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి  ఆమెమీద చేతులుంచ గానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. లూకా 13:12,13

యేసుచూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను; వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబ డించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. లూకా 18:42,43

శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమ పరచెను. - లూకా -23:47       

ఆదిమ అపోస్తలులు స్తుతించింది, ఘనపరచింది ఎవనిని?
పేతురు స్తుతించింది ఎవనిని?

మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.  1 పేతురు 1:3

పౌలు స్తుతించింది ఎవనిని?

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌. రోమా 1:25

నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.  2 కోరింధీ 11:31

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసీ 1:3

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటి కంటెను 

అత్యధి కముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగు నుగాక. ఆమేన్‌. ఎఫెసీ 3:20,21

పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. రోమా 6:18

నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను. – 1 కోరింధీ 14:18

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. – 1 కోరింధీ 15:57

కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. – 2 కోరింధీ 1:3

... ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. – 2 కోరింధీ 2:14

మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. – 2 కోరింధీ 8:16

చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. – 2 కోరింధీ 9:15
              
పరలోకంలో నిత్యం స్తుతింపబడుతూ ఉండేది ఎవరు?

అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబల మును స్వీకరించి యేలు చున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. – ప్రకటన 11:16,17

యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే ప్రార్ధించబడింది ఎవరు?

సకల ప్రవక్తలచే ప్రార్ధించబడింది ఎవరు?

అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను.  ఆది 21:33

కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను. యోనా 2:9,10

యేసుచే ప్రార్ధించబడింది ఎవరు?

అప్పుడు యేసుమరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండు డని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మత్తయి 26:38,39

ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు 1:35

ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. లూకా 6:12

యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యోహాను 11:41

మార్త యేసుతోప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. యోహాను 11:21,22      

యేసు ఎవనిని ప్రార్ధించమని ఆజ్ఞాపించారు?

నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. –మత్తయి 6:6

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,  మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.  మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మత్తయి 6:9-13

ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పి నట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందు కాయనమీరు ప్రార్థన చేయునప్పుడుతండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము. – లూకా 11:1-3    

ఆదిమ అపోస్తలులు, పౌలు ప్రార్ధించింది ఎవనిని?

పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. - అ.పో.కా 12:5

అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. - అ.పో.కా 16:25   

తనకు పోలిక కలిగిన మరొకడు లేని దేవుడు ఎవరు?

చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. యెషయ 46:9

కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?  యెషయా 40:18

యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు... –యిర్మీయ 10:6

ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?యోబు 36:22     
యెహోవాయే యెసైతే యేసును పోలిన వారెందుకు ఉన్నారు?

అతడు (మెల్కిసేదేకు) తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. హెబ్రీ 7:3

మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ... –ప్రకటన 14:14  

చావు, పుట్టుకలకు అతీతుడు ఎవరు?

మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. – 1 సమూయేలూ 15:29

నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను. – హోషేయ 11:9
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతు ష్పాద 

జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. – రోమా 1:23

సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహి మయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌. – 1 తిమోతీ 1:17

బ్రతికించువాడే కాక చంపువాడైన దేవుడు ఎవరు?

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు. - ద్వితీ 32:39

జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.  1 సమూయేలూ 2:6

దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు...- సంఖ్యా 23:19 

సర్వ శక్తినీ – అధికారాలనూ కలిగిన దేవుడు ఎవరు?

మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను;  నేను సర్వశక్తిగల దేవుడను... నిర్గమ 6:2,3
అబ్రాము తొంబదితొమి్మది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను. –ఆది 17:1

 ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. రోమా 13:1    


సకల మానవ బలహీనతలకు అతీతుడైనవాడు ఎవరు?

నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.  యెషయా 40:28

ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. – కీర్తనలు 121:4  

భూత-భవిష్య-వర్తమాన కాలాలలోనూ దేవునిగా ఉన్నవాడు ఎవరు?

నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. యెషయా 43:10

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. – యిర్మియా 10:10

ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. – కీర్తనలు 48:14
 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్‌. ఆమేన్‌. – కీర్తనలు 41:13

ఈ అన్ని ప్రత్యేకతలలో ఏ ఒక్కదానినో లేక వాటిలో కొన్నిటినో కాక, అన్నిటిని ఉమ్మడిగా కలిగినవాడు ఎవరు?

ఇప్పటివరకు మనము గమనించిన ఈ అన్నీ ప్రత్యేకతలూ ఉమ్మడిగా కలిగిన ఏకైక దేవుడు ఎవరు? యేసా? పరిశుద్ధాత్మ? అని ప్రశ్నించుకుంటే పూర్తి బైబిల్లో “నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడని” “నన్ను పోలిన వాడు మరొకడు లేడని” “బ్రతికించు వాడనే కాక చంపువాడను” అని, “స్వస్థపరచువాడనే కాక గాయ పరచువాడను” అని ప్రకటించుకున్న ఏకైక దేవుడు, ఒక్క యెహోవా మాత్రమే! అంతేకాదు సకల మానవ బలహీనతలకు అతీతుడైనవాడు, సర్వశక్తినీ-అధికారాలనూ స్వతహాగా కలిగి ఉన్నవాడు, భూత-భావిషత్-వర్తమాన కాలాలలోనూ దేవునిగా ఉన్నవాడు, సకల ప్రవక్తలచే, యేసుచే స్తుతించబడి, ఘనపరచబడి, ప్రార్ధించబడిన, వేడుకోబడిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన దేవుడు ఒక్క యెహోవా మాత్రమే! అసలు పరిశుద్ధ బైబిల్ ప్రకారం ఒక క్రైస్తవుడు నిజదేవునిగా నిర్ధారించుకోవలసింది ఎవరిని? అన్న ప్రశ్నకు అనేక పరిశుద్ధ వాక్యాల వెలుగులో ప్రస్తావించబడిన పై కొలమానాలే ప్రామాణికం అవుతాయి.

నేటి సువార్తీకులు ప్రచారం చేస్తున్న స్వంత కొలమానాలేమిటి?

పరిశుద్ద బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? అన్నది నిర్ధారించుకోవటానికి కావలసిన పై ప్రమాణాలను విడిచి పెట్టి, యేసును ఏదోలా దేవుడని నిరూపించటానికి నేటి సువార్తీకులు ఉపయోగిస్తున్న స్వంత  కొలమా నాలేమిటంటే- “యేసు, తండ్రి లేకుండా పుట్టారు” “తండ్రీ, నేను ఏకమై ఉన్నామని చెప్పారు” “నన్ను  చూచువాడు తండ్రిని చూచినట్లే అన్నారు” “అబ్రహాముకంటే ముందున్న వాడనని చెప్పారు” “సర్వాధికా రాలు నాకు ఇవ్వబడ్డాయని చెప్పారు” అన్నవి. పైగా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు యేసును దేవుడని ఒప్పుకోవటంలో తప్పేముంది? ఇన్ని ప్రత్యేకతలు ఎవరికి ఉన్నాయి? కాబట్టి యేసే దేవుడు అని వాదిస్తూ ఉంటారు.

నిజంగా యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – యేసు అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – యేసు తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! వగైరా వగైరా ప్రత్యేకతలను బట్టి యేసు దేవుడని ప్రకటించటంలో తప్పులేదనుకుంటే అలా ప్రకటించటానికి మొట్ట మొదటి హక్కు దారులు యేసు శిష్యులే అవుతారు. కానీ గమనార్హమైన విషయం ఏమిటంటే-  ఈ ప్రత్యేకతలన్నిటినీ స్వయంగా “విని” “చూచి” ఉన్న ఆదిమ అపోస్తలులు ఏనాడూ యేసును దేవుడై ఉంటారని ఊహించుకోవటంగానీ, అలా యూదులను ఒప్పించటంగానీ చేయలేదు. కానీ, ఇంటింటికీ తిరిగి యేసే “క్రీస్తు” అయి ఉన్నాడని ఒప్పించేవారు (అ.పో.కా 5:42). కానీ ఇవే ప్రత్యేకతలను బైబిల్లో “చదివి” నేటి సువార్తీకులు యేసు దేవుడని ఊహించుకుని “యేసు మెస్సియ” అయి ఉన్నారని ప్రకటించటానికి బదులు “యేసే దేవుడ”ని ప్రకటిస్తున్నారు! ముఖ్యంగా యేసు తన దర్శనంలో కనిపించారని ప్రకటించుకున్న పౌలు సైతం ఏనాడూ యేసే దేవుడని ప్రకటించక యూదులకు అనేక లేఖనాలను ఆధారంగా చూపి యేసు “మెస్సియ” (క్రీస్తు) అయి ఉన్నారని ఒప్పిస్తూ ఉండేవాడు (అ.పో.కా 17:3+18:5) తప్పితే నేను దర్శనంలో దేవుణ్ణి చూచానని గాని, యేసే దేవుడని గానీ ఏనాడూ ప్రకటించలేదు. దానికి కారణం-యేసు కలిగి ఉన్నప్రతీదీ దైవ ప్రసాదితమే కాబట్టి! ఆ విషయాన్ని స్వయంగా యేసే ప్రకటించి ఉన్నారు “నీవు నాకు అనుగ్రహించినవన్నియూ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు” (యోహాను 17:8). దీనిని బట్టి యేసు శక్తీ, అధికారాలు, మహిమలు వగైరా ఏ ప్రత్యేకతలు కలిగి ఉన్నా అదంతా దేవుని ద్వారా ఇవ్వబడిందే తప్ప యేసు స్వతహాగా ఏదీ కలిగిలేరని తెలుస్తుంది. అటువంటప్పుడు స్వీయ శక్తి సామర్థ్యాలు, స్వీయ అధికారాలు కలిగిన యెహోవా  దేవుడవుతాడా? యెహోవా ద్వారా సృష్టింపబడి, గత ప్రవక్తల మాదిరిగానే యెహోవా ద్వారా జీవం, శక్తి-సామర్థ్యాలు ఇవ్వబడిన యేసు దేవుడవుతారా? అన్నది ఆలోచించగలరు.                

No comments:

Post a Comment