దేవుని పై ఆధారపడే వాడు సర్వసృష్టికర్తతో సమానమైన దేవుడు కాగలడా?

“నా అంతట నేను ఏమి చేయలేను” అని ప్రకటించుకునేవాడు దేవుడు కాగలడా?

నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. - యోహాను 5:30

ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను. – యోహాను 12:49,50

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. – యోహాను 5:19

నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. –యోహాను 8:28     

కానీ యెహోవా తనకిష్టమొచ్చినట్లు ప్రతీదీ చెయ్యగలడు!

ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. – యోబు 23:13 

వేరొకని దయపై, జీవం పై ఆధారపడి జీవించేవాడు సర్వాధికారి అయిన దేవుడు లేక దేవునితో సమానమైన దేవుడు కాగలడా?
యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.- లూకా 2;52

జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే … -యోహాను 6:57 

కానీ యెహోవా స్వంత జీవం కలిగి ఉన్నాడు!

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు...  ఇర్మియ 10:10 

పరిమిత జ్ఞానం కలవాడు దేవుడు కాగలడా?
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు. –మత్తయి 24:36

ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాల మైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.  మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని  ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దాని మీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.  - మార్కు 11:11-13

 కాబట్టి వారు కూడివచ్చినప్పుడుప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీన మందుంచుకొని యున్నాడు.. అIIపోIIకా 1:6,7  

కానీ యెహోవా అనంత జ్ఞానం కలవాడు!
యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు.. -1 సముయెలూ 2:3
మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు. – కీర్తనలు 147:5 
 అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. – రోమా 16:27 

సాతాను చే శోధించబడేవాడు దేవుడు కాగలడా?
అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. – మత్తయి  4:1

కానీ దేవుడనబడేవాడు సాతాను చే శోధించబడడు!
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు… - యాకోబు 1:13 

ఇహ-పర లోకాలలో స్వతహాగా ఏ అధికారమూ కలిగి లేనివాడు దేవుడు కాగలడా?
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. – మత్తయి 28:18 

అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. – మత్తయి 20:20-23 

ఈ విధంగా తనంతట తాను ఏదీ చేయలేనివాడు, వేరొకని దయపై ఆధారపడి జీవించే వాడు, పరిమిత జ్ఞానం కలవాడు, స్వీయ అధికారాలు కలిగి లేనివాడు దేవుడు ఎలాకాగలడు? ఆలోచించగలరు.     

No comments:

Post a Comment